రాజస్థాన్‌లో మరో దిగ్బ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త, అత్తమామలు
వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏడీజీ (క్రైమ్)ని సంఘటనా స్థలానికి పంపి, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సదరు మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఈ సంఘటన గురువారం జరిగిందని ధరియావాడ్ ఎస్‌హెచ్‌ఓ పెషావర్ ఖాన్ తెలిపారు.
ఆమె అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి ఘటన జరిగిన తమ గ్రామానికి తీసుకెళ్లారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఉమేష్ మిశ్రా తెలిపారు. ఆమె వేరే వ్యక్తితో ఉండడంతో ఆమె అత్తమామలు తట్టుకోలేకయారు. ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్‌ని శుక్రవారం రాత్రి ప్రతాప్‌గఢ్‌కు వెళ్లి పరిశీలించారు.
కాగా వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ముందు మహిళ బట్టలు విప్పి ఆపై ఒక గ్రామంలో ఆమెను నగ్నంగా ఊరేగించినట్లు ఉంది. అయితే ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, నిందితులను అరెస్టు చేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతాప్‌గఢ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ కుమార్ గ్రామంలోనే ఉండి నిఘా పర్యవేక్షిస్తున్నారని డీజీపీ మిశ్రా తెలిపారు.
ఈ సంఘటనపై స్పందిస్తూ, గెహ్లాట్ X ( ట్విట్టర్)లో స్పందించారు. “ప్రతాప్‌గఢ్ జిల్లాలో కొన్ని కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళను ఆమె అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో బయటపడింది. ఏడీజీ క్రైమ్‌ను అక్కడికక్కడే పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు. నాగరిక సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు చోటు లేదు. ఈ నేరస్థులను వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రాసిక్యూట్ చేసిన తర్వాత చట్టపరమైన శిక్షలు విధిస్తాం అని పేర్కొన్నారు.
అయితే, గెహ్లాట్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందిస్తూ గర్భిణీ స్త్రీని ప్రజల ముందు వివస్త్రను చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన రాజస్థాన్‌ను సిగ్గుపడేలా చేసిందని, ఆ వీడియోను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ధరియావాడ్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్ మీనా వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.
మరో ఘటనలో మైనర్‌పై కత్తితో బెదిరించి అత్యాచారం
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై కత్తితో బెదిరించి ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, నిందితుడు వీడియోను కూడా రికార్డ్ చేశారని పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 29న మైనర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి అశోక్ కుమార్ అనే వ్యక్తిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని గూడమలాని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జై కిషన్ తెలిపారు. మైనర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 1న కేసు నమోదు చేసినట్లు కిషన్ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేరని, తండ్రి ముంబైలో పనిచేస్తున్నారని, ఇరుగుపొరుగు వారి ద్వారా ఈ విషయం తెలిసి సెప్టెంబర్ 1న గ్రామానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని గోలియన్‌గర్వా గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి మైనర్‌పై కత్తితో అత్యాచారం చేసి వీడియో కూడా తీశాడు. ఈ ఘటనపై కూడా స్థానికంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి.