మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..

మదర్స్ డే వేడుకల్లో ఒంటరి తండ్రి తన కూతురి కోసం తల్లి వేషంలో వచ్చి..
Spread the love

తల్లి లేని చిన్నారిని ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అపురూపంగా చూసుకుంటున్నాడు. పాపకు తల్లి లేదనే బాధ మనసులోకి రాకుండా ప్రేమగా పెంచుకుంటున్నాడు థాయిలాండ్ కు చెందిన 48ఏళ్ల ప్రాచ్చ దీబూ(Prachya Deebu). కుమార్తె పేరు  నట్టవాడీ కోర్ంజన్ (Nattawadee Kornjan) కాగా ప్రేమగా క్రీమ్ అని పిలుచుకుంటన్నాడు. అయితే ఇటీవల కూతురు చదువుకుంటున్న స్కూల్ లో మదర్స్ డే వేడుకలు జరిగాయి. అందరు పిల్లలు తమ తల్లులను తీసుకొచ్చారు. కానీ తన 15 ఏళ్ల కుమార్తెకు తల్లి లేకపోవడంతో అమె తరపు వారెవరూ హాజరుకాలేదు. ఇక్కడే దీబూ చేేసిన పని అందరి హృదయాలను కదిలించింది.  దీంతో తన కుమార్తె కోసం ఒక తల్లిమాదిరిగా మహిళ దుస్తులతో స్కూల్ కు వచ్చి తన కూతురితో కలిసి మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నాడు.

దీబు  పాఠశాలలో మాతృ దినోత్సవ వేడుక (Mother’s Day celebrations)లకు హాజరైనప్పుడు తన కుమార్తెతో కలిసి తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీన్థాని చూసిన నెటిజన్లు భావోద్వేగంతో ఉప్పొంగిపోయారు. థాయ్ లాండ్‌లో మే 12 కాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న మదర్స్ డే వేడుకలు జరుపుకుంటారు. ఆ రోజు దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు తమ తల్లుల పట్ల ప్రేమ, గౌరవాన్ని చూపే  పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఈ క్రమంలో దీబూ తన కుమార్తె పాఠశాలలో జరిగిన మదర్స్ డే వేడుకల కోసం, దీబు తెలుపు, నలుపు రంగు రంగుల దుస్తులు ధరించాడు. అతను పొడవాటి జట్టు కలిగిన విగ్‌ని కూడా ధరించాడు. ఈ చిత్రంలో కుమార్తె, నట్టవాడీ కోర్ంజన్ ముఖంపై  చిరునవ్వుతో అతని ముందు కూర్చున్నట్లు ఉంది.

మదర్స్ డే వేడుకల సందర్భంగా  దీబూ మాట్లాడుతూ..  “నేను ఒంటరి తండ్రిని.. ఆమె నా దత్త పుత్రిక అయినప్పటికీ  కన్నబిడ్డ కంటే ఎక్కువ.  తను నా కుమార్తె అని నేను ఎల్లప్పుడూ క్రీమ్‌కి చెబుతాను. నేను ఆమెను నా కన్న బిడ్డలా ప్రేమిస్తున్నాను” అని స్థానిక మీడియాకు వెల్లడించాడు. దీబు ఆమె చిన్నతనంలో క్రీమ్ అని ముద్దుగా పిలుచుకునే కోర్ంజన్‌ని దత్తత తీసుకున్నాడు. “నా అమ్మాయిని చూసుకోవడానికి నేను ఒక తండ్రిగా అలాగే తల్లిగా నా వంతు కృషి చేస్తాను,” అని దీబు చెప్పాడు.

ఆగస్ట్ 11న ఈ పోస్ట్ నుఫేస్ బుక్ (Facebook) లో  షేర్ చేయగా అది వైరల్ అయింది. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు చలించిపోయారు. దీబు పై ప్రశంసల జల్లు కురిపించారు. మీది నిజమైన ప్రేమంటూ కొనియాడారు. కాగా ఈ పోస్టును చూసి ఇప్పటి వరకు దాదాపు 14,000 మంది రియాక్ట్ అయ్యారు. ఇది దాదాపు 1,500 సార్లు రీ-షేర్ చేశారు.

గ్రీన్ మొబిలిటీ, సోలార్ పవర్,  సేంద్రియ సాగు కు సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి.

రాష్ట్రీయ,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను అలాగే ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *