బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..
Spread the love

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్

Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట్టుకొని ఉన్న ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను నగరలోని కూడళ్లలో ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడితే, వారిపై భారతీయ శిక్షాస్మృతి ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని సీపీ చెప్పారు. ముఖ్యంగా యువకులు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రధాన రోడ్డు మార్గాల్లో ద్విచక్ర వాహనాలను నిలిపివేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకున్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవరైనా వ్యక్తులు బహిరంగంగా తల్వార్లను ఎత్తిచూపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు.

READ MORE  Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *