వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్…