Sunday, April 27Thank you for visiting

ఆటోలో రు.12లక్షల ఆభరణాల బ్యాగును మరిచిన ప్రయాణికురాలు..

Spread the love

Warangal : ఆటోలో మర్చిపోయిన సూమారు రూ.12 లక్షల విలువ గల 240 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు.

ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు వివరాలను వెల్లడించారు. శనివారం రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందగట్ల జోత్స్న వరంగల్ చౌరస్తా బట్టలతో పాటు తన ఇంటిలోని బంగారు ఆభరణాలకు మెరుగు పెట్టించుకొని ఆటోలో కాశిబుగ్గ చౌరస్తాలోదిగి ఇంటికి వెళ్లింది. కాగా బంగారు ఆభరణాల బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన సదరు మహిళ వెంటనే కాశిబుగ్గ చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎర్ర రవికి సమాచారం ఇచ్చింది. ఆయన తక్షణమే అప్రమత్తమైన హోంగార్డు తన మ్యాన్ ప్యాక్ ద్వారా ఇన్ స్పెక్టర్ వెంకన్నతో పాటు, మిగతా ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ లోని అన్ని ఆటో స్టాండ్లతో పాటు, ఆటో యూనియన్లకు సమాచారమిచ్చారు. బాధిత మహిళ ప్రయాణించిన ఆటో డ్రైవర్ తన ఆటోలో బ్యాగును గుర్తించి ఆటో యూనియన్, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఆటోలోని బంగారు ఆభరణాల బ్యాగును స్వాధీనం చేసుకొని బాధిత మహిళకు ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు, వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న, ఎస్ఐ శ్రవణ్ కుమార్, హోంగార్డ్ రవి సమక్షంలో బాధిత మహిళకు బంగారు ఆభరణాల బ్యాగును తిరిగి అప్పగించారు. అనంతరం ట్రాఫిక్ హోంగార్డు రవితో పాటు ట్రాఫిక్ అధికారులు వెంటనే స్పందించి నిమిషాల వ్యవధిలోనే రూ.12 లక్షల విలువైన 240 గ్రాముల బంగారు ఆభరణాలు వున్న బ్యాగును తిరిగి తమకు అప్పగించినందుకు బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

READ MORE  Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..