Aditya-L1 launch: హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శనివారం ఆదిత్య-ఎల్1 లాంచ్ కుసంబంధించిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం (ఆన్‌లైన్) ద్వారా చూడవచ్చు. ‘సూర్యుడికి సంబంధించిన విశేషాలు, ఆదిత్య-ఎల్ 1 మిషన్’పై సైన్స్ చర్చ కూడా జరుగుతుందని బిఎమ్ బిర్లా సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటోరియం(hyderabad birla planetarium) డైరెక్టర్ కెజి కుమార్ తెలిపారు. ” మధ్యాహ్నం 12 గంటలకు ‘Our Sun’ పై ఓపెన్ హౌస్ క్విజ్ కూడా నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు బిర్లా ప్లానిటోరియంకు వచ్చి లాంచ్‌ని వీక్షించవచ్చు.. తరువాత క్విజ్‌లో పాల్గొనవచ్చు,” అని తెలిపారు.
ఆదిత్య L1 గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది సూర్యుడి వైపు వెళ్లేందుకు భారతదేశం నుంచి ఇది మొట్టమొదటి మిషన్. ‘ఆదిత్య’ అంటే సూర్యుడు అని, ఎల్1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అని అర్థం. ఇది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఏడు వేర్వేరు పేలోడ్‌లను
తీసుకువెళుతుంది. వీటిలో నాలుగు సూర్యుడి నుంచి వచ్చే కాంతిని విశ్లేషి స్తాయి. మిగిలిన మూడు ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి
ఇన్-సిటు పారామితులను కొలుస్తాయని తెలిపారు.
చంద్రయన్ 3 (chandrayan-3) గ్రాండ్ సక్సెస్ తర్వాత నూతనోత్తేజంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తొలి సౌర మిషన్ — ఆదిత్య-L1 కోసం సిద్ధమైంది. శ్రీహరికోటలోని లాంచ్ ప్యాడ్ నుండి శనివారం 11:50 IST గంటలకు సన్ మిషన్ ప్రారంభం కానుంది. లాంచ్ రిహార్సల్, వాహన అంతర్గత తనిఖీలు అన్నీ పూర్తయ్యాయి.
సూర్యుడిపై సమగ్ర అధ్యయనం
ఆదిత్య-ఎల్1 అనేది భారతదేశపు మొట్టమొదటి సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ. దీన్ని PSLV-C57 ద్వారా ప్రయోగించనున్నారు. ఆదిత్య-L1లో అతిపెద్ద, సాంకేతిక పరంగా అత్యంత సవాలుగా ఉండే పేలోడ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ లేదా VELC. ISRO సహకారంతో హోసాకోట్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ CREST (సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ) క్యాంపస్‌లో పరీక్షించబడింది. ఆదిత్య-L1 భూమికి సూర్యుని దిశలో 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 (లేదా L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఈ దూరాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఈ వ్యూహాత్మక స్థానం నుంచి ఆదిత్య-L1 ద్వారా శాస్త్రవేత్తలు రియల్ టైంలో సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని
అధ్యయనం చేస్తారు. అలాగే, అంతరిక్ష నౌక యొక్క డేటా సౌర విస్ఫోటనం సంఘటనలకు దారితీసే ప్రక్రియల క్రమాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అంతరిక్ష వాతావరణ గురించిన లోతైన అవగాహనకు దోహదం చేస్తుంది.
Electric Vehicles, సేంద్రియ సాగు, పర్యావరణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.