KARGIL WAR | 25 ఏళ్ల క్రితం 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. దేశ రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ 1965, 1971, 1999లో కార్గిల్‌లో యుద్ధాల్లో
పలువురు సైనికులు తమ ప్రాణాలను అర్పించారని వెల్లడించారు. “పాకిస్తానీ కమ్యూనిటీ అనేది ధైర్యవంతుల సంఘం, “అది 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం కావచ్చు, వేలాది మంది షుహాదాలు (అమరవీరులు) పాకిస్తాన్ కోసం తమ ప్రాణాలను అర్పించారు అని రావల్పిండిలో జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నారు.
ఇదివరకెప్పుడూ పాకిస్తాన్ సైన్యం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నట్లు బహిరంగంగా అంగీకరించలేదు చొరబాటుదారులను “కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులు” లేదా “ముజాహిదీన్ లు అంటూ పేర్కొంటూ వచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజా వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారాయి. కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర లేదిన పాకిస్తాన్ దశాబ్దాల క్రితం చేసిన ప్రకటలకు సంబంధించిన పోస్టులను నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు.
First time ever #PakistaniArmy accepts involvement in #KargilWar. Pakistan Army Chief General #AsimMunir confirms Pakistan Army’s involvement in #KargilWar. Pakistan Army Chief General Asim Munir in a defence day speech on Friday said, “1948, 1965, 1971 or Kargil war between… pic.twitter.com/Um83MwSrwM
— Upendrra Rai (@UpendrraRai) September 7, 2024
KARGIL WAR లో ఏం జరిగింది?
1999లో ఇరు దేశాల మధ్య శాంతి, సుస్థిరత కోసం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య లాహోర్ డిక్లరేషన్ సంతకం చేసిన కొద్దిసేపటికే, మే 1999లో పాక్ బలగాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) దాటి జమ్మూలోకి చొరబడ్డాయి. ‘ఆపరేషన్ బదర్ (Operation Badr. ) అనే కోడ్‌నేమ్‌తో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా కాశ్మీర్.. భారత సైన్యానికి చెందిన పోస్టులను స్వాధీనం చేసుకుంది.
సియాచిన్ గ్లేసియర్ (Siachen Glacier) వద్ద భారత సైన్యాన్ని పారదోలడం.. కాశ్మీర్ – లడఖ్ మధ్య సంబంధాన్ని తెంచడం లక్ష్యంగా పాకిస్తాన్ చొరబాటుదారులు లడఖ్ ప్రాంతంలోని కార్గిల్ లోని ద్రాస్ బటాలిక్ సెక్టార్‌లలో NH 1Aకి ఎదురుగా ఆక్రమించారు. ఈ ఆపరేషన్ వెనుక పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ మెదలుపెట్టారు. లాహోర్ ప్రకటన తరువాత, పాకిస్తానీ దళాల దుర్మార్గపు పన్నాగం గురించి భారత సైన్యం మొదట్లో గుర్తించలేదు.
అయితే, పాకిస్తాన్ కుట్ర గురించి తెలుసుకుని భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పాకిస్తాన్‌ను ఖాళీగా ఉన్న మన సైనిక ప్రదేశాల నుంచి తరిమివేయడానికి 200,000 మంది భారతీయ సైనికులను ఆ ప్రాంతంలోకి పంపింది. ఈ మిషన్‌కు ‘ఆపరేషన్ విజయ్’ అనే కోడ్ పేరు పెట్టారు. యుద్ధాన్ని ప్రారంభమైంది. 18,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొన్ని పోస్ట్‌లతో, ఎత్తైన ప్రదేశాలలో పోరాడినందున ఇది భారతదేశం చేసిన అత్యంత కఠినమైన సవాళ్లతో కూడిన యుద్ధాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.
భారతదేశం, పాకిస్తానీ సైన్యాల మధ్య రెండు నెలల భీకర పోరు తర్వాత, ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ కు మద్దతు లభించలేదు. పాక్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ రావడంతో పాకిస్తాన్ వెనుదిరిగింది. కార్గిల్ లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారతదేశం కార్గిల్ పోరాట యోధులను సత్కరించింది. 1999 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా జూలై 26ని ‘కార్గిల్ విజయ్ దివస్’గా పిలుస్తారు.
‘మా తప్పు’: కార్గిల్ యుద్ధంపై నవాజ్ షరీఫ్
మే చివరలో, జనరల్ పర్వేజ్ ముషారఫ్ చేసిన కార్గిల్ దురదృష్టాన్ని ప్రస్తావించి, 1999లో తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన ఇస్లామాబాద్ ఒప్పందాన్ని ఇస్లామాబాద్ “ఉల్లంఘించిందని” అంగీకరించాడు. చారిత్రాత్మక లాహోర్ డిక్లరేషన్‌ను ప్రస్తావిస్తూ “ఇది మా తప్పు” అని నవాజ్ అన్నారు. ముషారఫ్ చేత పదవీచ్యుతుడైన నవాజ్.. కార్గిల్ ఆపరేషన్‌ను పాకిస్తాన్ సైన్యం చేసిన వ్యూహాత్మక “బ్లాండర్” అని పేర్కొన్నాడు. కార్గిల్‌లో మరణించిన పాక్ సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి పాక్ సైన్యం నిరాకరించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..