Sunday, October 13Latest Telugu News
Shadow

Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల‌ని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్ప‌ష్టం చేస్తోంది. అందుకే కొత్త దరఖాస్తుదారులు వారి NRC దరఖాస్తు రసీదు సంఖ్య (ARN) సమర్పించాలని మేము నిర్ణయించాము.” అని వెల్ల‌డించారు.

READ MORE  7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..

ఇది “అక్రమ విదేశీయుల వ‌ల‌స‌ల‌ ప్రవాహాన్ని అరికడుతుంది” ఆధార్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం “చాలా కఠినంగా” ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అస్సాంలో ఆధార్ పొందడం అంత సులభం కాదు అని శర్మ అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియలో బయోమెట్రిక్ లాక్ చేయబడిన 9.55 లక్షల మందికి ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్‌ను సమర్పించడం వర్తించదని తెలిపారు.

గత రెండు నెలల్లో పలువురు బంగ్లాదేశీయులను పట్టుకుని పొరుగు దేశ అధికారులకు అప్పగించింద‌ని, అక్రమ విదేశీయులను గుర్తించే ప్రక్రియను తమ ప్రభుత్వం ముమ్మరం చేస్తుందని హిమంత బిస్వా శర్మ చెప్పారు.

READ MORE  LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్