Tirupati Laddu | హైదరాబాద్: వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి వేద స్థానం (TTD) తీపికబురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ (Tirupati Laddu ) విక్రయించగా ఇకపై ప్రతీరోజు విక్రయించాలని నిర్ణయించారు. ఈ లడ్డూ ప్రసాదం ఇకపై ప్రతిరోజూ అందుబాటులో ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్వామివారి లడ్డూ విక్రయాల్లో లో తితిదే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు పవిత్రమైన లడ్డూ ప్రసాదం (రూ.50కి ఒక లడ్డూ) ఇక నుంచి ప్రతీరోజూ అందజేయాలని నిర్ణయించారు.రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల (Tirumala ) వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా వెంకన్న స్వామివారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 58,100 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 20,817 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..