Home National Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్

Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్

0
4
Pahalgam Attack
Spread the love
  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడి
  • సింధు జల ఒప్పందం రద్దు,
  • పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశం

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్‌పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన దౌత్య దాడిని ప్రారంభించింది, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు చావు దెబ్బ చూపించాలని కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత ఐదు నిమిషాల మీడియా ప్రసంగంలో భారతదేశం ఐదు నిర్ణయాత్మక కఠినమైన ప్రతీకార చర్యలను ప్రకటించింది. అవి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం నుంచి పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల గడువు జారీ చేయడం వరకు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. అలాగే అట్టారి సరిహద్దు మూసివేస్తామని ప్రకటించింది.కీలకమైన దౌత్య మార్గాలను కట్ చేసి న్యూఢిల్లీ స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారతదేశం చిందించే ప్రతి రక్తపు చుక్కకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది.

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రాజధానిలో మీడియాతో మాట్లాడుతూ, CCS “ఈ ఉగ్రవాద దాడి యొక్క తీవ్రతను గుర్తించింది” దౌత్య, వ్యూహాత్మక, రాజకీయ ఒత్తిడిని ప్రయోగించే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు.

Pahalgam Attack : 5 కీలక చర్యలు

సింధు జలాల ఒప్పందం రద్దు:

భారతదేశం – పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్ధు తక్షణమే అమలులోకి వొస్తుంది. “పాకిస్తాన్ తన సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది” అని మిస్రి అన్నారు.

అట్టారి సరిహద్దు చెక్‌పోస్ట్ మూసివేత :

భారతదేశం అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేసింది. అయితే, చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్‌తో ఇప్పటికే భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్తానీ జాతీయులు మే 1, 2025 కి ముందు అదే మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతించబడతారు.

పాకిస్తానీ జాతీయులకు వీసా పరిమితులు:

దౌత్య, పౌర మార్పిడికి ప్రత్యక్ష దెబ్బగా, పాకిస్తానీ జాతీయులు ఇకపై SAARC వీసా మినహాయింపు పథకం (SPES) కింద భారతదేశానికి ప్రయాణించడానికి అనుమతి ఉండదు. గతంలో జారీ చేయబడిన ఏవైనా SPES వీసాలు తక్షణమే రద్దు అవుతాయి. ఈ పథకం కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ జాతీయులు దేశం విడిచి వెళ్ళడానికి 48 గంటల సమయం ఇచ్చింది.

పాకిస్తాన్ రక్షణ సిబ్బంది బహిష్కరణ

అరుదైన దౌత్య చర్యలో భాగంగా, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నావికా, వైమానిక సలహాదారులను భారతదేశం ‘పర్సనా నాన్ గ్రాటా’గా ప్రకటించింది. ఈ అధికారులు దేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం సమయం ఇచ్చింది.

ఇస్లామాబాద్ నుంచి తన మిలిటరీ అటాచ్‌లకు పిలుపు

ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో నియమించబడిన తన సొంత రక్షణ, నేవీ మరియు వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంది. ఈ దౌత్య హోదాలు అధికారికంగా రద్దు చేయబడ్డాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here