
కోల్‌కతా మెట్రో (Kolkata metro) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జోకా-మజెర్‌హాట్ (పర్పుల్ లైన్), న్యూ గారియా-రూబీ మోర్ (Orange Line) కారిడార్‌లతో పాటు కొన్ని ప్రదేశాలలో ‘నో బుకింగ్ కౌంటర్ స్టేషన్ (No Booking Counter Stations)లను’ పరిచయం చేసింది.
పైలట్ ప్రాజెక్ట్ మొదట్లో పర్పుల్ లైన్ (Purple Line,)లోని తారతలా, సఖేర్‌బజార్, ఆరెంజ్ లైన్‌లోని కవి సుకాంత అనే మూడు స్టేషన్‌లను కవర్ చేస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ స్టేషన్లను ఎంపిక చేశారు. కోల్‌కతా మెట్రో ఎంపిక చేసిన స్టేషన్‌ల కోసం ‘బుకింగ్ కౌంటర్ స్టేషన్‌లు ఉండవు ‘ అని ప్రకటించింది
Kolkata Metro లోని ఈ మెట్రో స్టేషన్లలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు జారీ చేసే బుకింగ్ కౌంటర్లు మూసివేశారు. వీటికి బదులుగా, ప్రయాణీకులు టోకెన్‌లు, స్మార్ట్ కార్డ్‌లు, పేపర్ QR కోడ్ ఆధారిత టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న స్మార్ట్ కార్డ్‌లను రీఛార్జ్ చేయడానికి ఆటోమేటిక్ స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ మెషీన్‌లను (ASCRMలు) ఉపయోగించాల్సి ఉంటుంది. ASCRMలు టికెటింగ్ కోసం UPI చెల్లింపులకు కూడా అనుమతిస్తాయని అధికారులు తెలిపారు.
తారాటాల స్టేషన్‌లో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య సుమారుగా 70, కవి సుకాంత స్టేషన్‌లో 220 మంది ప్రయాణికులు వస్తుంటారు. సఖేర్‌బజార్ స్టేషన్ ప్రతిరోజూ దాదాపు 55 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మెట్రో రైల్వే అధికారులు రాబోయే రోజుల్లో ప్రయాణికుల స్పందనలు, ఫీడ్‌బ్యాక్‌లను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఆరు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడించారు. ఈ విధానం విజయవంతమైతే క్రమంగా మిగతా స్టేషన్లకు విస్తరించనున్నట్లు తెలిపారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..