New Ration Cards | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు కీలకమైన ముందడుగు పడింది. రేషన్ కార్డుల మంజూరులో విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం (Telangana Cabinet) తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా మంజూరు చేయనున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards ) జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రేషన్ కార్డుల జారీ విధివిధానాల సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు, రేషన్ కార్డులను విడివిడిగా జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా తెలంగాణ ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే అర్హులైన నిరుపేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ధరణి కాదు.. భూమాత
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పేరును మార్చి భూమాతగా మార్చనున్నారు. అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అలాగే జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క వ్యవహరించనున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..