Home » Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా
Lava Yuva 2 Smartphone

Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా

Spread the love

5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌,

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

READ MORE  BSNL నుంచి కొత్తగా రూ. 999 ప్లాన్.. 3 నెలల పాటు 3600 GB డేటా

Lava Yuva 2 ధర

భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలోని లావా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేమొచ్చు.

Lava Yuva 2 Smartphone స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) లావా యువ 2 ఆండ్రాయిడ్ 12పై నడుస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ సాంద్రతతో 6.51-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌పై వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. కొత్త Lava ఫోన్ 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా నడుస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా హ్యాండ్‌సెట్ 6GB వరకు RAMకి మద్దతు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే Lava Yuva 2 LED ఫ్లాష్‌తో 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ HDR, పోర్ట్రెయిట్, బ్యూటీ, స్లో మోషన్‌తో సహా కెమెరా మోడ్‌లు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఇది స్క్రీన్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు.
Lava Yuva 2లోని కనెక్టివిటీ విషయానికొస్తే 4G, బ్లూటూత్ 5, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటరీ సెన్సార్ ఉన్నాయి. లావా హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

READ MORE  Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా 'మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Lava Yuva 2 ఫోన్ 5,000mAh బ్యాటరీతో 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ గరిష్టంగా 40 గంటల టాక్‌టైమ్‌ను, 533 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్‌ను, ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 గంటల వరకు స్టాండ్‌బై టైమ్‌ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 164.96×76.1×8.7mm కొలతలతో, 202 గ్రాముల బరువు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..