మీ నగరంలో తాజా ధరలను చెక్ చేసుకోండి
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల (కె) బంగారం ధరలు నిన్నటి ధరతో పోల్చితే గ్రాముకు రూ.30 తగ్గగా, 24K బంగారం ధర గ్రాముకు రూ.33 తగ్గింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం , ఒక గ్రాము 22 కేరెట్ల బంగారం కోసం, కొనుగోలుదారులు రూ.5510, ఎనిమిది గ్రాములకు రూ.44,080 చెల్లించాలి.అలాగే 10 గ్రాములు, 100 గ్రాముల ధరలు వరుసగా రూ.55,100 మరియు రూ.5,51,000.
ఇక 24 కేరెట్ల బంగారం కోసం ఒక గ్రాము ధర రూ.6011, ఎనిమిది గ్రాముల ధర రూ.48,088. అదే సమయంలో, 10 గ్రాములు, 100 గ్రాములు వరుసగా రూ.60,110, రూ.6,01,100కి అందుబాటులో ఉన్నాయి.
నగరం 22K బంగారం ధర (10 గ్రాములు) 24 బంగారం ధర (10 గ్రాములు)
అహ్మదాబాద్ రూ.55,150 రూ.60,160
బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై రూ.55,100 రూ.60,110
చెన్నై రూ.55,500 రూ.60,550
ఢిల్లీ రూ.55,250 రూ.60,260
అయితే, పైన పేర్కొన్న రేట్లు కేవలం సూచిక మాత్రమేనని.. GST, TCS, ఇతర పన్నులను కలిగి ఉండవని గమనించాలి. ఖచ్చితమైన ధర కోసం, ప్రజలు తప్పనిసరిగా వారి స్థానిక నగల వ్యాపారులను సంప్రదించాలి.
ఆగస్టు 2న వెండి ధరలు.
మరోవైపు వెండి ధర గ్రాముకు రూ.0.7 తగ్గింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం , ఒక గ్రాము ధర రూ.77.30, ఎనిమిది గ్రాములు రూ.618.40, అలాగే 10 గ్రాములు రూ.773. 100 గ్రాముల కోసం, కస్టమర్‌లు రూ.7730, 1 కిలోగ్రాముకు రూ.77,300 ఖర్చు చేయాలి.
నగరం వెండి ధర (10 గ్రాములు)
అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై రూ.773
బెంగళూరు రూ.765
చెన్నై, హైదరాబాద్ రూ.803
కోల్‌కతా రూ.780