
Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా
5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్,దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Lava Yuva 2 ధర
భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప...