National

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

Spread the love

GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లోమొలాసిస్‌పై కూడా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

మొలాసిస్ పైనా భారీగా తగ్గింపు

ప్రస్తుతం మొలాసిస్‌పై జీఎస్టీ 28 శాతంగా ఉండగా.. దానిని 5 శాతానికి తగ్గించేందుకు కౌన్సిల్ (GST council meet) నిర్ణయించింది. ఆల్కహాల్ ఉత్పత్తిలో ముడి పదార్థంగా ఉపయోగించే మొలాసిస్‌పై జీఎస్‌టీని తగ్గించడం వల్ల చెరకు రైతులకు మేలు కలుగుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆలహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల గరిష్ట వయోపరిమితిని నిర్ణయించారు. ఇకపై ట్రిబ్యునల్ చైర్మన్ గరిష్ఠ వయసు 70ఏళ్లు, సభ్యుల వయసు 67ఏళ్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వయోపరిమితి అధ్యక్షుడికి 67 ఏళ్లు, సభ్యులకు 65 గా ఉంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *