గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పురస్కార ప్రదానం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు. దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఇక్కడ ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవం నుండి ఫోటోలను ట్వీట్ చేస్తూ, “భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక వామ్ సైన్ అని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ @ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చేతులమీదుగా ఫ్రాన్స్‌లో PM @narendramodi గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌తో సత్కరించారు. అని వెల్లడించారు.
అంతకుముందు, ఫ్రాన్స్ అధ్యక్షురాలు ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ ఎలీసీ ప్యాలెస్‌లో మోదీకి విందును ఏర్పాటు చేశారు.
గురువారం సాయంత్రం, మోదీ ఇక్కడ భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్రాన్స్‌లో UPI ఉపయోగం కోసం ఒక ఒప్పందాన్ని ప్రకటించారు. నగదు రహిత తక్షణ చెల్లింపులో భారతీయ ఆవిష్కరణకు భారీ కొత్త మార్కెట్‌ను తెరిచారు.
సెయిన్ నదిలోని ఒక ద్వీపంలో ప్రదర్శన కళల కేంద్రమైన లా సీన్ మ్యూజికేల్ వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి దాదాపు గంటసేపు ప్రసంగించిన మోదీ.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. ప్రపంచం కొత్త దిశగా పయనిస్తోందని అందులో భారతదేశం బలం, పాత్ర కూడా కీలకంగా మారుతోందని పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో కొత్త భారతీయ కాన్సులేట్‌ను ప్రారంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. యూరోపియన్ దేశంలో మాస్టర్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఐదేళ్ల పోస్ట్-స్టడీ వర్క్ వీసాలు లభిస్తాయని చెప్పారు.
ఫ్రాన్స్ తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, అందులో తాను గౌరవ అతిథిగా హాజరవుతున్నానని పేర్కొన్న మోదీ, తాను చాలాసార్లు ఆ దేశానికి వచ్చానని, అయితే ఇది ఈసారి ప్రత్యేకమైనదని, భారతదేశానికి దాని మద్దతు. ఇరుదేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని కొనియాడారు.
ప్రవాస భారతీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని కోరారు. ప్రపంచ నిపుణులు భారత్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా గుర్తిస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోందని మోదీ పేర్కొన్నారు.