Wednesday, April 16Welcome to Vandebhaarath

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Spread the love

Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు.

గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు..

ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to Zahirabad ) రుకోవడానికి  కేవలం గంటన్నర సమయమే పడుతుంది. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటూ వ్యాపారస్తులు, సాధారణ ప్రజలు చాలా  రోజులుగా కోరుతున్నారు.ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే పనులు మొదలు పెట్టారు.  ప్రస్తుతం ఉన్న రైలు మార్గం వికారాబాద్ మీదుగా నిర్మించారు.. దీని కారణంగా తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకునేందుకు 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది..  ఇందుకు మూడు గంటల సమయం పడుతోంది. కొత్త రైల్వేలైన్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నరలోనే జహీరాబాద్ చేరుకునే వెలుసుబాటు కలుగుతుంది.

READ MORE  Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ - హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

సరుకుల రవాణాకు అనుకూలం..

Zahirabad Railway Line  : తాండూరు ప్రాంతం కందుల సాగుకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తయిన కందులకు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంటుంది. కందుల రవాణాతో రైల్వే శాఖతోపాటు రైతులకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే తాండూరు ప్రాంతంలో అనేక పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులను రవాణా చేయడంద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇక్కడి అవసరాలను ద్రుష్ట్యా ఈ ప్రాజెక్టు రెండేళ్లలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. సరకు రవాణాద్వారా అధిక ఆదాయం సమకూరే ప్రాంతాలకు రైల్వే శాఖ ప్రాధాన్యమిస్తోంది. పారిశ్రామికంగా అవసరాలను తీర్చడం కోసం రైల్వే లైన్ నిర్మించడంతో అది ప్రజా రావాణాకు కూడా ఉపయోగపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.

READ MORE  Congress Jana Jathara | మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో జమ

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *