Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇవే..

Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు  రైళ్ల వివరాలు ఇవే..
Spread the love

Railway News | హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ (Kazipet Ballarsha Section) లో   ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు మ‌రికొన్నింటిని దారిమ‌ళ్లించ‌నున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను దారి మళ్లించి నడపించ‌నున్నారు. ఈ వివరాలను దక్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ఒక‌ ప్రకటనలో పేర్కొంది. యి.

Cancellation  Of Trains  (రద్దయిన రైళ్ల వివ‌రాలు)

  • జూన్ 26 నుంచి జులై 6 వ‌ర‌కు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్ మ‌ధ్య న‌డిచే గే కాగజ్ న‌గ‌ర్‌ గర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు (12757/12758) రద్దయ్యాయి.
  • ఈ నెల 28, జులై 5న పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (22151)
  • జూన్ 30, జులై 3న కాజీపేట-పుణె ఎక్స్ప్రెస్ (22152)
  • జూన్ 28న, హైదరాబాద్-గోరఖ్ పుర్ ( 02575)
  • జులై 30న గోరఖ్ పుర్ హైదరాబాద్ ( 02576) ఎక్స్ ప్రెస్ రద్దయ్యాయి.
  • జులై 2న ముజఫర్ పుర్‌ -సికింద్రాబాద్ (05293) ,
  • జూన్ 27 జులై 4న సికింద్రాబాద్- ముజఫర్పుర్ (05294)
  • జూన్ 29న గోరఖ్ పుర్-జడ్చర్ల (05303)
  • జులై 1న జడ్చర్ల-గోరఖ్ పుర్ (05304) రైళ్లు రద్దయ్యాయి.
  • అలాగే సికింద్రాబాద్-రాక్సల్ మధ్య న‌డిచే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28వ‌ తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్ల మధ్య న‌డిచే వేర్వేరు ఆరు ట్రెయిన్లు జూన్ 27, 28, 29, జులై ఒక‌ట‌వ‌ తేదీల్లో.. సికింద్రాబాద్-సుబేదార్ గంజ్ మధ్య న‌డిచే రైళ్లు జూన్ 27, 29వ‌ తేదీల్లో రద్దయ్యాయి.

దారి మ‌ళ్లించిన రైళ్లు..

  • తెలంగాణ, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను దారి మళ్లించి నడిపించ‌నునన్న‌ట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్- న్యూఢిల్లీ ( 12723) తెలంగాణ ఎక్స్ ప్రెస్ ను జూలై 4, 5, 6వ‌ తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా న‌డిపించ‌నున్నారు. కాజీపేట, రామగుండం మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణ మార్గం నుంచి ఈరైలును తొలగించారు.
  • న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (12724) తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలును జూలై 3, 4, 5వ‌ తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపించ‌నున్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి దీనిని త‌ప్పించారు.
  • సికింద్రాబాద్-నిజాముద్దీన్, నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లను (12285/12286) జులై 4, 5వ‌ తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపించ‌నున్నారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *