
New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ
Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది. మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు.
గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు..
ఈ కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to...