Vande Bharat Express sleeper coach: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు! భారతీయ రైల్వే మరి కొద్ది నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదటి స్లీపర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన వందే భారత్ స్లీపర్ రైలును భారతీయ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సహకారంతో BEML తయారు చేస్తోంది.
Indian Railways వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా కోసం ఉత్పత్తి పనులు గత ఏడాది అక్టోబర్-చివరిలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి-మార్చిలో రైలు సిద్ధంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వందే భారత్ స్లీపర్ రైలు ఎలా మెరుగ్గా ఉంటుంది? ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో నడుస్తున్న ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయని టైమ్స్ అఫ్ ఇండియా తన పేర్కొంది.
ఉదాహరణకు, ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బెర్త్‌ల వైపు అదనపు కుషనింగ్ అందించబడింది, తద్వారా ప్రయాణీకులు నిద్రిస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
Vande Bharat Express స్లీపర్ రైలు ఫీచర్లు:
- రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన కుషనింగ్‌తో కూడిన సౌకర్యవంతమైన బెర్త్‌లు
- ఎగువ బెర్త్‌లకు సులభంగా ఎక్కడానికి మెరుగ్గా డిజైన్ చేయబడిన నిచ్చెనలు
- మెరుగైన కప్లర్‌లతో కుదుపులు లేని సుఖవంతమైన ప్రయాణం
- ఆకర్షణీయంగా కనిపించేలా లోపలి భాగంలో క్రీమ్, పసుపు, కలప రంగులు ఉపయోగించారు.
- కామన్ ఏరియాలో సెన్సార్ ఆధారిత లైటింగ్.
- కోచ్‌ల మధ్య ప్రాంతంలో సులభంగా కదలిక కోసం స్ట్రిప్స్ ద్వారా నేలపై మెరుగైన నైట్ లైటింగ్
- పవర్ఫుల్ ఓవర్ హెడ్ లైటింగ్
- యాంటీ-స్పిల్ ఫీచర్స్ కలిగిన వాష్ బేసిన్లు..
పైన పేర్కొన్నవే కాకుండా, కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో కొన్ని ఇతర ముఖ్య లక్షణాలు:
- రైలు హెడ్‌లైట్‌ల కోసం డేగ పక్షి కళ్ల నుండి స్ఫూర్తితో ఏరోడైనమిక్ ఎక్స్టెరియల్
- GFRP ప్యానెల్‌లతో కూడిన బెస్ట్ క్లాస్ ఇంటీరియర్స్
- సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్
- ఆటోమేటిక్ ఔటర్ పాసింజెర్స్ డోర్స్.
- దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, మరుగుదొడ్లు
- ఫస్ట్ ఏసీ కార్ లో వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు.
- పబ్లిక్ అనౌన్స్మెంట్స్ దృశ్య సమాచార వ్యవస్థ
- విశాలమైన లగేజీ గది
- ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన టాయిలెట్ సిస్టమ్
చైర్ కార్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express ) రైళ్ల మాదిరిగానే, స్లీపర్ వేరియంట్‌లు కూడా 160 kmph వేగంతో స్వీయ చోదక పంపిణీ పవర్ రైలు సెట్‌లను కలిగి ఉంటాయి. వేగవంతమైన పికప్ తోపాటు వేగాన్ని తగ్గించే సామర్థ్యం వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఇది రాత్రిపూట రైలు ప్రయాణాలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
16 కోచ్ వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్‌లో 11 ఏసీ 3 టైర్ కోచ్‌లు, 4 ఏసీ 2 టైర్ కోచ్‌లు, ఒక ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటాయి. ఈ రైలు మొత్తం 823 మంది ప్రయాణికుల బెర్త్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..