
Ram Mandir Temple Inauguration : రామజన్మభూమి అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22వ తేదీన సోమవారం రామ మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) చేతుల మీదుగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు ముందు సుమారు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
మూడు రాష్ట్రాల్లో డ్రై డే
‘డ్రై డే’ అంటే మద్యపానీయాల విక్రయాలను ఆ రోజు నిలిపివేస్తారు. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, క్లబ్ లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వరు. జనవరి 22వ తేదీన జాతీయ పండుగలా జరుపుకుంటామని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath ) ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ నుంచి రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వేల సంఖ్యలో దేవాలయాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ప్రసారం చేస్తారు.
ప్రాణప్రతిష్ఠ పూర్తి షెడ్యూల్ ఇదే
ఈనెల 15న అయోధ్యలో యజ్ఞ క్రతువులు ప్రారంభమవుతాయి. రాముడి విగ్రహాన్ని యాగ శాల మండపంలోకి తీసుకునివస్తారు.
16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభమవుతాయి.
17న శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు,
18న మండప ప్రవేశపూజ, వాస్తు, వరుణ, వినాయక పూజలతో ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి శ్రీకారం
19న యజ్ఞ అగ్నిగుండం స్థాపన,
20న 81 కలశాలతో పుణ్యాహవచనంతో రామ మందిర గర్భ గుడిని వేద మంత్రాలతో పవిత్రం చేయనున్నారు.
21న జలాధి వాసం అంటే అయోధ్య రాముడి విగ్రహాన్ని 125 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు.
22న అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన. ఆ రోజున మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వ్యవధిలో అంటే 84 సెకన్ల పాటు శుభఘడియల సమయంలో గర్భ గుడిలో కేటాయించిన స్థలంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
ఈనెల 24 నుంచి అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
దైవ దర్శన సమయాలు
ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు రామచంద్రుడిని దర్శించుకోవచ్చు. ఇక ప్రత్యేక సందర్భాల్లో గానీ. పర్వదినాల సమయాల్లో దర్శన వేళల్లో మార్పులు ఉంటాయని అయోధ్య రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
ఉదయం 6: 30 గంటలకు శృంగార్ హారతి,
మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి,
సాయంత్రం 07:30 గంటకు సంధ్యా హారతి నిర్వహించనున్నారు.
భక్తులందరికీ రామ మందిరంలోకి ప్రవేశం ఉచితమే కానీ ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు టిక్కెట్లను కూడా అందుబాటు లో ఉంచనున్నారు. వీటిని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది..
ఈ నిబంధనలు పాటించాలి..
Ram Mandir Temple Inauguration Rules : రామ మందిరంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ను పాటించాలి. ఆలయం లోనికి ప్రవేశించేటపుడు భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది..
పురుషులు దోతీ, గంచా, కుర్తా-పైజామా ను ధరించాలి. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు.. ఇక జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులను ఏమాత్రం అనుమతించరు.
మరోవైపు భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడాన్ని నిషేధించారు., మనీ పర్సులు, హ్యాండ్ బ్యాగులు, ఇయర్ ఫోన్లు, వాలెట్స్, హెడ్ ఫోన్లు, రిమోట్ తో కూడిన కీ చైన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఆలయంలోనికి అనుమతించరు. గొడుగులు, బ్లాంకెట్లు, గురుపాదుకలను తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..