Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..

Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..
Spread the love

Ujjain minor rape case  మూడు రోజుల తర్వాత 12 సంవత్సరాల వయస్సు గల బాలిక గాయపడిన స్థితిలో నగర వీధుల్లో నడుస్తూ కనిపించిన మూడు రోజుల తర్వాత భరత్ సోనీని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది

ఉజ్జయిని: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన నిందితుడి.. తండ్రి శుక్రవారం తన కుమారుడికి ఉరిశిక్ష విధించాలని కోరాడు.. మరోవైపు న్యాయవాదులు ఎవరూ కోర్టులో అతని తరపున వాదించకూడదని స్థానిక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ కేసులో ఆటో రిక్షా డ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేశారు.

“ఇది సిగ్గుమాలిన చర్య, నేను అతనిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లలేదు, నేను నా కొడుకు కోపం పోలీసు స్టేషన్‌కు గానీ కోర్టుకు గానీ వెళ్లను. నా కొడుకు నేరం చేసాడు, కాబట్టి అతన్ని ఉరితీయాలి” అని అతని తండ్రి ఇక్కడ విలేకరులతో అన్నారు.

READ MORE  Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు

ఉజ్జయిని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటన టెంపుల్ సిటీ ప్రతిష్టను దెబ్బతీసిందని అన్నారు.నిందితుల కేసు విచారణ చేపట్టవద్దని మా సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

మూడు రోజులకు ముందు 12 సంవత్సరాల వయస్సు గల బాలిక గాయపడిన స్థితిలో నగర వీధుల్లో నడుస్తూ వీధుల్లో నడుస్తూ సాయం కోసం అర్తించిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దిగ్బ్రాంతికరమైన ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు  భరత్ సోనీని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది.

READ MORE  Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి

విచారణ కోసం నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన సోనీకి గాయం అయ్యిందని పోలీసులు గురువారం తెలిపారు. బాలికను ఇండోర్‌లోని ప్రభుత్వ మహారాజా తుకోజీరావు హోల్కర్ మహిళా ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ ఆమెకు బుధవారం  శస్త్రచికిత్స చేశారు.

ఒక కౌన్సెలర్ ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆమె madhypradesh  సత్నా జిల్లాకు చెందినదని కనుగొన్నారు. కానీ ఆమె పేరు, చిరునామా సరిగా చెప్పలేకపోయింది. సాత్నాలో అదే వయస్సు గల బాలిక అదృశ్యమైనట్లు ఫిర్యాదు నమోదైందని, అయితే అత్యాచారం బాధితురాలు అదే బాలిక అని నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

READ MORE  Train Accident యూపీలో పట్టాలు తప్పి బోల్తాపడ్డ రైలు కోచ్‌లు.. ప‌లువురు మృతి

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా క్షీణించాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ఆరోపించారు.

“మధ్యప్రదేశ్‌లో  మైనర్లపై అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అతని (చౌహాన్) పాలనలో 18 ఏళ్లలో యాభై ఎనిమిది వేల రేప్ కేసులు, 68,000 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. కానీ దేశ ప్రధాని, హోంమంత్రి, బీజేపీ నేతలంతా మౌనంగా కూర్చున్నారు’’ అని ఢిల్లీలో విలేకరులతో అన్నారు.

నిర్భయ కేసు బాధితురాలిపై జరిగిన దాడి కంటే ఈ దళిత యువతిపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *