Saturday, December 21Thank you for visiting
Shadow

Tag: Tamil Nadu

Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..

Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..

Crime
Kallakurichi Hooch Tragedy | కరుణాపురం, కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘ‌ట‌న‌లో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మరో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో కళ్లకురిచి దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం, మరో 115 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని జిప్మర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, చెక్కులను అందజేసి, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న‌లుగురి అరెస్టు ఈ దుర్ఘటనపై విచారణ జరిపి భవిష్యత్...
Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?

Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయ‌న పాత్ర‌లో నటించేదెవరో తెలుసా.. ?

Trending News
Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. "విశాల్ తె...
Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Lok Sabha Elections Key contests : మొద‌టి ద‌శ పోలింగ్‌ ప్రారంభం.. 102 సెగ్మెంట్ల‌లో ప్రముఖుల జాబితా ఇదే..

Elections
Lok Sabha Elections Key contests 2024 |  18వ లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఏప్రిల్ 19న శుక్రవారం న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్లు పాల్గొంటారు. తమిళనాడులో మొత్తం 39, రాజస్థాన్‌లో 12, ​​ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అస్సాంలలో ఒక్కొక్కటి 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 చొప్పున‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అన్ని సీట్ల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. తమిళనాడులో.. Lok Sabha Elections Key contests | తొలి దశ ఎన్నికల పోరులో పలువురు కీలక అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా తమిళనాడులో ద్...
Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..

Radhika Sarathkumar | లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో రాధికా శ‌ర‌త్ కుమార్‌..

National
 Radhika Sarathkumar | ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. రాధికను విరుదునగర్ నియోజకవర్గ అభ్య‌ర్థిగా బీజేపీ (BJP)  పోటీలో నిలిపింది.  రాధిక భర్త శరత్ కుమార్ 2007లో ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. మొదట్లో ఆయన డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. అనంతరం అన్నాడీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆయన ఏఐఏడీఎంకేను వీడి 31 ఆగస్టు 2007న ఆల్ ఇండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని ప్రారంభించారు.గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరఫున తెన్‌కాసి, నంగునేరి రెండు నియోజకవర్గాల్లో సమాక డబుల్‌ లీఫ్ గుర్తుపై విజయం సాధించింది. తెన్కాసిలో శరత్‌కుమార్‌, నంగునేరిలో ఎర్నావూరు ఎ.నారాయణన్‌ గెలుపొందారు. 2016లో శరత్‌కుమార్ తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యంతో పొత్తు పెట్టుకున్న శరత్‌కుమ...
Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Crime
Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో " నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ "ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ చేయడానికి గ్యా...
పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

Crime
చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి.ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది.నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు.దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...
కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

Trending News
తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.యాక్సిడెంట్‌లో చనిపోతే తన...
సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య

National
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటనడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం  6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది...