మూసీ బాధితుల కోసం రంగంలోకి బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..
Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా బాధితులైనవారి తరఫున తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్ రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్, అసెంబ్లీ, ముసారాంబాగ్, అంబేడ్కర్ నగర్, తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని,...