Musi development | హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. మూసీ (Musi River) సుందరీకరణలో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు మరోసారి రెడీ అయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను ఈరోజు నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్‌ఘాల్‌లో రెడ్ మార్క్ చేసిన నివాసలను రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్లకు ఆర్బీ-ఎక్స్ మార్కింగ్ చేశారు. ఇక్కడి నిర్వాసితులను కూడా తరలించారు. మంగళవారం మూసానగర్, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌లో కూల్చివేతలను చేపట్టనున్నారు.
మూసీకి ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య సుమారు 30 నుంచి 40 వేల మధ్య ఉంటుందని అధికారులు భావించారు. కానీ తాజా మ్యాప్ ప్రకారం రివర్ బెడ్ (రెడ్ లైన్) పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70వేలకు పెరిగే చాన్స్ ఉంది. అలాగే ఎఫ్‌ఆర్‌ఎల్ (బ్లూ లైన్) పరిధిలోకి వచ్చే నివాసాల సంఖ్య దాదాపు ఒక లక్షకు పైగానే ఉంటుందనే అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో చోట ఎఫ్‌ఆర్‌ఎల్ వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా… దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్ణయించాల్సి ఉంటుంది. మూసీ ప్రక్షాళన (Musi development) పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు లక్షన్నరకు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసీలో తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..