Hydra: హైడ్రాకు.. అదనపు బలం.. ఇక నేరుగా రంగంలోకి
Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్ చేర్చుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ అయింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూతన సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బదలి చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్ జారీ ...