Sunday, October 13Latest Telugu News
Shadow

రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!

RRB Technician Jobs | నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ పోస్టుల‌ భర్తీకి ఈ సంవత్స‌రం మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. అయితే ఈ పోస్టులను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ కొలువుల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది.

పోస్టుల వివరాలు

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 1,092,
  • టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 8,052
  • టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు 5,154

కేటగిరీ వారీగా..

  • యూఆర్‌- 6171,
  • ఎస్సీ- 2014,
  • ఎస్టీ- 1152,
  • ఓబీసీ- 3469,
  • ఈడబ్ల్యూఎస్‌- 1481

RRB Technician Jobs అలాగే రైల్వే జోన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా వెల్లడించింది. ఇందులో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 వరకు ఖాళీలున్నాయి. అత్యధికంగా చెన్నై జోన్‌లో 2716 పోస్టులు, అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెరిగిన నేపథ్యంలో మరోమారు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆర్‌ఆర్‌బీ చాన్స్ ఇచ్చింది. దీని ప్ర‌కారం.. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 కాగా, ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును సరిదిద్దడంతో పాటు పోస్టుల ప్రియారిటీని ఇచ్చుకోవచ్చని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది.

READ MORE  Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టుల‌కు నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ప‌రీక్ష విధానం, వేత‌నాలు..

అభ్య‌ర్థుల‌కు కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900ల చొప్పున ప్రారంభ వేతనం చెల్లిస్తారు.

అర్హతలు

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణలై ఉండాలి.

READ MORE  రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి

టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్‌/ మెకానిక్ డీజిల్‌/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్ / గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్ / ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితర విభాగంలో ఉత్తీర్ణ పొంది ఉండాలి. లేదంటే 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌) ఉత్తీర్ణలై ఉండాలి.

READ MORE  RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 11558 రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా ఖాళీల వివరాలు 

ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్- 1015
ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్- 900
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు- 337
ఆర్‌ఆర్‌బీ భోపాల్- 534
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్- 166
ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్- 933
ఆర్‌ఆర్‌బీ చండీగఢ్- 187
ఆర్‌ఆర్‌బీ చెన్నై- 2716
ఆర్‌ఆర్‌బీ గువాహటి- 764
ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్- 721
ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా- 1098
ఆర్‌ఆర్‌బీ మాల్దా- 275
ఆర్‌ఆర్‌బీ ముంబయి- 1883
ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్- 113
ఆర్‌ఆర్‌బీ పట్నా- 221
ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్- 338
ఆర్‌ఆర్‌బీ రాంచీ- 350
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 959
ఆర్‌ఆర్‌బీ సిలిగురి- 91
ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం- 278
ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్‌- 419


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్