Kishan Reddy | పేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్
Musi Beautification | కాంగ్రెస్ సర్కారు పేదల ఇండ్లను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 నెలలు కాకముందే పేదల కాలనీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చడానికి కుట్ర పన్నిందని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోరణితో వ్యవహరించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింద...