టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ
పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జనగ్నాథ్ ఆలయం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్రదాయ డ్రెస్ కోడ్ (Dress code)ను అమలు చేశారు. జగన్నాథుడి దర్శనానికి కోసం వచ్చే భక్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్, షార్ట్స్, టోర్న్ జీన్స్, స్కిర్ట్స్, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వచ్చే వారికి స్వామివారి దర్శనం ఉండదని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాలలో గుట్కా, పాన్ తినడంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగాన్ని కూడా నిలిపివేశారు.
జనవరి 1 నుంచి పూరి జగన్నాథస్వామి ఆలయం (Puri Jagannath Temple) లో ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయంలోకి వచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 1.40 గంటలకే ఆలయాన్ని తెరిచారు. ఆలయం ఎదుట ఉన్న గ్రాండ్ రోడ్డు వరకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులుతీరారు.అయితే ఇవాళ సోమవారం మధ్యాహ్నం వరకే సుమారుగా 2 లక్షల మంది భక్తులు జగన్నాథుడి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..