LPG cylinder price | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ పై త‌గ్గింపు ఎంతగా అంటే..!

LPG cylinder price | క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ పై త‌గ్గింపు ఎంతగా అంటే..!
Spread the love

LPG cylinder price reduced today: నూతన సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న ప్రభుత్వ చమురు కంపెనీలు (OMCలు) గ్యాస్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి.. ఈ క్రమంలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తారని అందరూ ఎదురుచూస్తుండగా గ్యాస్‌ కంపెనీలు ధరలను అతిస్వల్పంగా తగ్గించి అందరన్నీ ఫూల్స్ చేశాయి.
కొత్త సంవత్సరం మొదటి రోజున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు LPG సిలిండర్ల ధరను ఎంత తగ్గించారో తెలిస్తే… నవ్వాలో, ఏడవాలో కూడా అర్ధం కాదు..
ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని‌ 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను కేవలం రూపాయిన్నర మాత్రమే తగ్గించాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరను 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తాయి.

ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇవీ..

ధరల తగ్గింపు తర్వాత… దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 1,755.50కి చేరింది. గతంలో ఇది రూ. 1,757గా ఉండేది. ఈ లెక్కన ఢిల్లీలో ధర కేవలం రూ.1.50 మాత్రమే తగ్గింది. చెన్నైలో గరిష్టంగా రూ. 4.50 వరకు తగ్గింది, అక్కడ 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,924.50కి లభిస్తుంది. ఇక ముంబైలో రూ. 1.50 తగ్గి రూ.1,708.50 కు చేరుకుంది. అలాగే కోల్ కతాలో మరీ చోద్యంగా 50 పైసలు పెరిగి రూ.1,869 కి చేరింది, గత ఆదివారం ఈ ధర రూ. 1,868.50 గా ఉంది.

READ MORE  Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

గత పది రోజుల వ్యవధిలో రెండోసారి

అంతకుముందు, 2023 డిసెంబరు 22న కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ రేట్లను తగ్గించాయి. అప్పుడు 19 కిలోల సిలిండర్ రూ. 30.50 చొప్పున ధర తగ్గింది. దీని కంటే ముందు.. 2023 డిసెంబరు 1న కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ల రేటు రూ.21 చొప్పున పెరిగింది. 2023 నవంబరులో రూ. 101, అక్టోబరులో రూ. 209 మేర పెరిగింది. తద్వారా.. గత 3 నెలల్లో కమర్షియల్‌ గ్యాస్‌ రేట్లు మూడు సార్లు పెరిగాయి, మొత్తం రూ.320 పైకి చేరింది.

READ MORE  Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

దేశీయ గ్యాస్‌ సిలిండర్ ధరలో మార్పు లేదు..

దేశంలోని సామాన్య ప్రజలకు ఈసారి సైతం ఊరట లభించలేదు.. ఇళ్లలో వంట కోసం వాడే దేశీయ ఎల్పీజీ సిలిండర్‌ ధర లో (Domestic LPG Cylinder Price Today) ఎలాంటి మార్పు లేదు. ప్రతీసారి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మొండి చెయ్యి చూపిస్తూనే ఉన్నాయి. చివరిసారి 2023 ఆగస్టు 30 న డొమొస్టిక్‌ గ్యాస్‌ ధరలను సవరించారు.
ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.903, కోల్ కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, హైదరాబాద్ లో రూ.955, విజయవాడలో రూ.944.50గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.

READ MORE  BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?

LPG సిలిండర్ రేటును ఆన్ లైన్ లో చెక్‌ చేయాలి అనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ https://iocl.com/prices-of-petroleum-productsలో చూడొచ్చు. ఈ సైట్ లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ కొత్త రేట్లు ఉంటాయి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *