Friday, February 14Thank you for visiting

Petrol vs CNG : సీఎన్జీ కారు.. లేదా పెట్రోల్ కారు.. ఏది బెటర్..?

Spread the love

Petrol vs CNG : ఈ మధ్య కాలంలో సీఎన్జీ కార్ల (CNG car) సేల్స్ భారతదేశంలో విపరీతంగా పెరిగాయి. అయితే, పెట్రోల్ కారుపైననే విశ్వాసం ఉంచే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

CNG car vs petrol car: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు కూడా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో, కొనుగోలుదారులు సీఎన్జీ కార్ల వంటి ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

ధర తక్కువ

పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల ధరలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఇది ఎక్కవ మైలేజీని కూడా ఇస్తుంది. పెట్రోల్ తో కూడా నడవడం సీఎన్జీ కార్లతో ఉన్న మరో అదనపు ప్రయోజనం. సీఎన్జీ అందుబాటులో లేని సమయంలో పెట్రోల్ తో కూడా ఈ వాహనాలను నడపవచ్చు. ఈ వెసులుబాటు వల్ల వినియోగదారులు సీఎన్జీ వాహనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

READ MORE  Top 10 Tractors | ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టాప్ 10 ట్రాక్టర్ కంపెనీలు ఇవే..

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

మారుతి సుజుకీ WagonR రెండు వేరియంట్ల మైలేజీ ఇలా..

Petrol        25.19 km/ litre
CNG          34.05 km/kg

WagonR స్పెసిఫికేషన్స్ పోలిక
పెట్రోలు                  CNG
శక్తి           65.26 ps                56.7 ps
టార్క్        89 Nm                   82.1Nm

READ MORE  Car Running Cost Comparison | పెట్రోల్‌, CNG, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారా? ఇందులోఏది తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉందో తెలుసుకోండి

ఏది మంచిది?

సాధారణంగా.. పెట్రోల్ ధర CNG కంటే చాలా ఎక్కువ. దీని ఫలితంగా పెట్రోల్ తో మాత్రమే నడిచే కార్లకు నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ హైవేలు, నగరాలు, పట్టణాల్లో పెట్రోల్ బంక్ లు విరివిగా ఉండడం వల్ల పెట్రోల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయంలో ఇంధనం అయిపోతే ఎలా? అన్నఆందోళన పెట్రోలు కార్లతో ఏమాత్రం ఉండదు. ఇదే సమయంలో పెట్రోల్-సీఎన్జీ కార్ల విషయానికి వస్తే, సీఎన్జీ ధర తక్కువ కాబట్టి, వాటి రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సీఎన్జీతో మైలేజీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అయితే, పెట్రోల్-CNG మోడల్‌ కార్లు పెట్రోల్, సీఎన్జీ పవర్‌ట్రెయిన్ మెకానిజమ్స్ రెండింటినీ కలిపి అత్యంత సంక్లిష్టమైన టెక్నాలజీతో వస్తాయి. కాబట్టి పెట్రోల్-సీఎన్జీ మోడల్‌ వాహనాలకు నిర్వహణ ఖర్చు ఎక్కువ. CNG రీఫిల్లింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడం మరో సమస్యగా మారవచ్చు..

READ MORE  సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..

[table id=15 /]


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..