Home World Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

0
13
Pagers Explosion
Pagers Explosion
Spread the love

Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది.

 

రిమోట్ సిగ్న‌ల్స్ సాయంతో పేజ‌ర్ల‌ను పేల్చివేసిన‌ట్లు (Pagers Explosion) తెలుస్తోంది. హిజ్‌బుల్లా స‌భ్యులు లిథియం బ్యాట‌రీల త‌యారుచేసిన పేజ‌ర్లను వినియోగిస్తున్నారు. అయితే మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ పేలుళ్ల ఘ‌ట‌న‌లో.. ఎక్కువ శాతం హిజ్‌బుల్లా స‌భ్యులే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రిమోట్ సిగ్న‌ల్ అందిన త‌ర్వాత ఒకేసారి పేజ‌ర్ల‌న్నీ పేలిపోయిన‌ట్లు హిజ్‌బుల్లా అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి చెందిన సాంకేతిక స‌మాచారం ఇంకా అంద‌లేదు. ఏదో మాల్‌వేర్ ద్వారా ఈ అటాక్ జ‌రిగినట్లు అనుమానిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here