Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితా
- నితిన్ గడ్కరీ (మహారాష్ట్ర )
- రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
- పీయూష్ గోయల్
- జ్యోతిరాదిత్య సింధియా
- కిరణ్ రిజిజు
- హెచ్‌డి కుమారస్వామి (కర్నాటక)
- చిరాగ్ పాశ్వాన్ (బిహార్)
- రామ్ నాథ్ ఠాకూర్
- జితన్ రామ్ మాంజీ
- జయంత్ చౌదరి
- అనుప్రియా పటేల్
- ప్రతాప్ రావ్ జాదవ్ (SS)
- సర్బానంద్ సోనోవాల్
- JP నడ్డా
- శ్రీనివాస్ వర్మ
- రవ్‌నీత్ సింగ్ బిట్టు (పంజాబ్)
- కిషన్ రెడ్డి (తెలంగాణ)
- బండి సంజయ్ (తెలంగాణ)
- రామ్మోహన్ నాయుడు (ఆంధ్రప్రదేశ్)
- చంద్రశేఖర్ పెమ్మసాని (ఆంధ్రప్రదేశ్)
వార్తా సంస్థ ANI ప్రకారం, నరేంద్ర మోడీ టీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వచ్చినవారిలో అమిత్ షా, JP నడ్డా, BL వర్మ, పంకజ్ చౌదరి, శివరాజ్ సింగ్ చౌహాన్, అన్నపూర్ణా దేవి, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.
అలాగే బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్, రక్షా ఖడ్సే, నిత్యానంద్ రాయ్, హర్ష్ మల్హోత్రా భగీరథ్ చౌదరి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి కూడా సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ నేతలు కిరణ్ రిజిజు, జితిన్ ప్రసాద, రవనీత్ సింగ్ బిట్టు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్, రావ్ ఇంద్రజిత్ సింగ్, అజయ్ తమ్తా, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మాంఝీ, ఎల్‌జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. టీ పార్టీకి హాజరైన చాలా మంది నేతలు మోడీ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది.
బిజెపి 240 సీట్లు గెలుచుకున్నతర్వాత ఎన్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చారు. . 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న చంద్రబాబు కింగ్‌మేకర్‌గా అవతరించారు. 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..