Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.
అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొదట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షాలకు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ (టిడిపి)
రామ్ మోహన్ నాయుడు: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన 36 ఏళ్ల రామ్మోహన్ నాయుడు టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు. MBA డిగ్రీ హోల్డర్.. అయిన రామ్మోహన్ నాయుడు ప్రన్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. ఇతని తండ్రి కె.ఎర్రన్నాయుడు టీడీపీ సీనియర్ నేత, ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. 1996 నుంచి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
చంద్రశేఖర్ పెమ్మసాని: గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీకి చెందిన మరో కీలక నేత. 48 ఏళ్ల వైద్యుడు ఎన్నికల్లో పోటీ చేసిన సంపన్నులలో ఒకరు. ఆయన కుటుంబం ఆస్తుల విలువ ₹ 5,785 కోట్లు. 1999లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి MBBS సంపాదించిన తర్వాత, డాక్టర్ చంద్ర శేఖర్ యునైటెడ్ స్టేట్స్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో MD చదివారు.
జనతాదళ్ (యునైటెడ్)
లాలన్ సింగ్: 69 ఏళ్ల లాలన్ సింగ్ (రాజీవ్ రంజన్ సింగ్ ) నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. JD(U) మాజీ జాతీయ అధ్యక్షుడు, బీహార్ మంత్రి సింగ్ చాలా సంవత్సరాలుగా నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితులలో ఒకరు. అతను సోషలిస్ట్ దిగ్గజం మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ వారసుడిగా వచ్చారు. అతను 2004 నుంచి 2009 వరకు బెగుసరాయ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ముంగేర్ సీటును గెలుచుకున్నారు..
రామ్ నాథ్ ఠాకూర్: 1950లో జన్మించిన రామ్ నాథ్ ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుమారుడు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో ఎంపీగా పనిచేస్తున్నాడు. ఎగువ సభలో జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు. గతంలో, అతను బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. లాలూ ప్రసాద్ యాదవ్ మొదటి మంత్రివర్గంలో చెరకు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 2005 నుంచి నవంబర్ 2010 వరకు, అతను నితీష్ కుమార్ రెండవ మంత్రివర్గంలో రెవెన్యూ, భూ సంస్కరణలు, చట్టం, సమాచార- ప్రజా సంబంధాల మంత్రిగా పనిచేశారు. ఠాకూర్ ఏప్రిల్ 2014 నుండి ఏప్రిల్ 2020 వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
లోక్ జనశక్తి పార్టీ (LJP)
చిరాగ్ పాశ్వాన్: లోక్ జనశక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు. చిరాగ్ పాశ్వాన్ సినిమా పరిశ్రమలో కొద్దికాలం పనిచేసిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2020లో తన తండ్రి మరణం తర్వాత ఎల్‌జేపీ నాయకత్వాన్ని స్వీకరించారు.
అప్నా దళ్
అనుప్రియా పటేల్: అనుప్రియా పటేల్ 2016 నుంచి అప్నాదళ్ (సోనీలాల్) పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. 2021 నుంచి వాణిజ్యం- పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014 నుండి మీర్జాపూర్ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశారు.
జనతాదళ్ (సెక్యులర్)
హెచ్‌డి కుమారస్వామి: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి 2006లో తొలిసారిగా బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రెండవసారి ముఖ్యమంత్రిగా 2018లో కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.
రాష్ట్రీయ లోక్ దళ్
జయంత్ చౌదరి: రాజ్యసభ ఎంపీ, రాష్ట్రీయ లోక్ దళ్ (RLD)కి చెందిన జయంత్ చౌదరి ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..