Congress candidates |వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నాయకుడు కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు.
ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా, సిద్సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ,భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను పోటీలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం 75 మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది.