Home » BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్
BJP Manifesto 2024 relesed top 20 points

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఐదేళ్లు ఉచిత రేషన్, పైపులైన్ ద్వారా వంట గ్యాస్

Spread the love

BJP Manifesto 2024 : లోక్‌సభ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. వేదికపై బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రాజ్యాంగంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా విక్షిత్ భారత్ సాధనపై దృష్టి కేంద్రీకరించామని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని ఇళ్లకు పైపులైన్ ద్వారా ఎల్పీజీ గ్యాస్, సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందించనున్నామని ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రభుత్వం, పప్పుధాన్యాలు, వంటనూనెలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తిపై దృష్టి సారిస్తుందని, ధరలను స్థిరీకరించడానికి , పేదల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాలను విస్తరింపజేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.

BJP Manifesto 2024: టాప్ 20 హామీలు  ఇవే..

  1. ఇండో-చైనా, ఇండో-పాకిస్థాన్ ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో పటిష్టమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. “ఫెన్సింగ్‌ను మరింత పటిష్టంగా చేయడానికి మేము కంచె ఉన్న భాగాలపై సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెడతాము” అని పార్టీ తెలిపింది.
  2. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని , అర్హులందరికీ పౌరసత్వం కల్పిస్తామని బీజేపీ తెలిపింది.
  3. యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code) అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. “యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫాం సివిల్ కోడ్‌ను రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటిగా చేరుస్తుంది. దీని ద్వారా మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని BJP విశ్వసిస్తుంది,  దీనివల్ల అత్యుత్తమ సంప్రదాయాలను ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చడమని వివరించింది.
  4. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను అమలు చేస్తామని బీజేపీ చెప్పింది.  ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు హైపవర్డ్‌ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సుల అమలుకు కృషి చేస్తామన్నారు.
  5. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లను బలోపేతం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. “ఫోకస్డ్ ఫండింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్, డెడికేటెడ్ రీసెర్చ్ గ్రాంట్స్ ద్వారా మేము ప్రస్తుత సంస్థలను అప్‌గ్రేడ్ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.
  6. ఈశాన్య ప్రాంతంలో శాంతిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని పార్టీ పేర్కొంది. “ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడానికి, AFSPAని దశలవారీగా తొలగించడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము. నిరంతర ప్రయత్నాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల మధ్య అంతర్-రాష్ట్ర సరిహద్దు వివాదాల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని,” అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. .
  7. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని బీజేపీ హామీ ఇచ్చింది. “ఒక దశాబ్దంలో, మేము భారత్‌ను 11వ స్థానం నుండి 5వ అతిపెద్ద ఆర్థిక శక్తికి తీసుకువచ్చాము. సరైన విధానాలు, దూరదృష్టితో కూడిన అమలు,  ఖచ్చితమైన ప్రణాళికల వల్ల ఇది సాధ్యమైంది” అని  పేర్కొన్నారు.
  8. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే ఐదేళ్లపాటు 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందించనున్నట్లు బిజెపి తెలిపింది.
  9. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్.
  10. మూడు కోట్ల మంది గ్రామీణ మహిళలు ‘లఖపతి దీదీ‘లుగా మారనున్నారు.
  11. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల సమీపంలో మహిళా హాస్టళ్లు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చింది.
  12. మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆరోగ్య సేవలను విస్తరింపజేస్తామని బీజేపీ తెలిపింది.
  13. ఈ సేవలు రక్తహీనత, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, బోన్ మ్యారో వ్యాధి కేసులనుతగ్గించడంపై దృష్టి సారించాయి.
  14. పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ను క్రమపద్ధతిలో అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
  15. ఆయుష్మాన్ భారత్ పథకం వృద్ధులందరికీ వర్తిస్తుంది. వారికి ఉచిత, ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
  16. పంటలపై ఎప్పటికప్పుడు ఎంఎస్పీని పెంచుతామని పార్టీ హామీ ఇచ్చింది. “మేము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి ₹ 6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము . మా రైతులకు స్థిరమైన ఆర్థిక సహాయానికి మేము కట్టుబడి ఉన్నాము” అని అది పేర్కొంది.
  17. నిల్వ సౌకర్యాలు, నీటిపారుదల, గ్రేడింగ్,  సార్టింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయ-మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళికను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది.
  18. పంటల అంచనా, పురుగుమందుల వాడకం, నీటిపారుదల, నేల ఆరోగ్యం, వాతావరణ అంచనా వంటి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారించే  వ్యవసాయ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని హామీ ఇచ్చింది.
  19. అన్ని సామాజిక భద్రతా పథకాల్లో ఆటో, ట్యాక్సీ, ట్రక్కు, ఇతర డ్రైవర్లను చేర్చుతామని బీజేపీ హామీ ఇచ్చింది.
  20. ONDCతో చిన్న వ్యాపారులు, MSMEలకు సాధికారత కల్పించడం: “మేము చిన్న వ్యాపారులు, MSMEలను ONDCని స్వీకరించడానికి, సాంకేతిక శక్తిని ఉపయోగించి వారి వ్యాపారాలను విస్తరించడానికి ప్రోత్సహిస్తాము”. అని బీజేపీ తన మేనిఫెస్టోలోపేర్కొంది.


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
READ MORE  Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..