
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి పదవి
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్.. 30 ఏళ్లకు పైగా పార్టీ పదవుల్లో సేవలందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన, సమర్థవంతమైన నేతగా ఎదిగారు.65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూ...