MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
Spread the love

Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు.
ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది.

మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్ పాశ్వాన్, అతని బాబాయి పశుపతి కుమార్ పరాస్ ఇద్దరూ కీల‌క నేత‌లుగా ఉన్నారు. అయితే 2020లో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం త‌ర్వాత‌ కుటుంబ కలహాలు మొద‌ల‌య్యాయి. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

READ MORE  Railway Safety | పెరుగుతున్న రైలు ప్రమాదాల నివార‌ణ‌కు ఇక‌పై రైల్వే ఇంజన్లు, యార్డులపై AI- ఎనేబుల్డ్ సీసీ కెమెరాలు

ఆ తర్వాత పశుపతి పరాస్ బీజేపీ ప‌క్షాన నిలిచారు. చిరాగ్‌ పాశ్వాన్ వెనుక‌డుగు వేయ‌కుండా పోరాటం ప్రారంభించారు. అతను బీహార్ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్ అనే ప్రచారాన్ని మొద‌లు పెట్టారు. అయితే ఎన్‌డిఎకు మద్దతు ఇవ్వడం కొనసాగించాడు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికలలో కులమే కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రంలో.. పాశ్వాన్ ఓట్లను పొందేందుకు చిరాగ్ పాశ్వాన్ ఉత్తమమైన ఆప్ష‌న్ అని బిజెపి నిర్ణయించుకుంది. ప్లాన్ పని చేసింది. బిజెపికి మెజారిటీ తక్కువగా ఉండటం వల్ల సంకీర్ణ ప్రభుత్వ మనుగడకు కీలకమైన చిరాగ్ పాశ్వాన్ వంటి మిత్రపక్షాల స్థానం బలపడింది.

READ MORE  Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

NDTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ, “గత రెండు సంవత్సరాలు చాలా కష్టంగా ఉన్నాయి”. “నేను మా నాన్నను, నా పార్టీని, గుర్తును కోల్పోయాను. మేము ఈ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరు, కొత్త గుర్తుపై పోటీ చేశాము.. కొత్త గుర్తుకు ప్రజలను అలవాటు చేయడం చాలా కష్టమైన పని. కానీ దేవుడు మాపై ద‌య చూపాడు. ప్రజల్లో నాపై నమ్మకం పెంచుకున్నారు. అని చెప్పారు.

మోడీ 3.0 క్యాబినెట్‌లో తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలైకి చాన్స్‌..

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై (K.Annamalai) ఆదివారం కేంద్ర మంత్రి మండలిలో రాష్ట్ర మంత్రిగా చేరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం (Modi oath-taking ceremony)  చేయనున్నారు, రాష్ట్రపతి భవన్‌లో నేడు మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్న నేతలపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. అన్నామలై మంత్రి మండలిలోకి వచ్చిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని మరొకరికి కేటాయించే అవకాశం ఉంది.

READ MORE  అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

39 ఏళ్ల మాజీ IPS అధికారి అన్నామలై 2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కి చెందిన గణపతి రాజ్‌కుమార్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అన్నామలై 2019లో బీజేపీలో చేరి 2021లో పార్టీ తమిళనాడు విభాగానికి అధ్యక్షుడయ్యారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *