
కొరడాతో కొట్టుకున్న బిజెపి నేత అన్నామలై..
Tamilnadu BJP President Annamalai : చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై వినూత్న రీతిలో ఉద్యమించారు. బాధితురాలి పట్ల అధికార డీఎంకే, రాష్ట్ర పోలీసుల వైఖరిని నిరసిస్తూ తనదైన శైలిలో బహిరంగంగా కొరడాలతో కొట్టుకున్నారు. శుక్రవారం తమిళనాడు బీజేపీ అధినేత తనను తాను కొరడా ఝుళిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.చెన్నైలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై అధికార డీఎంకే ప్రభుత్వానికి నిరసనగా తాను 48 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, చెప్పులు లేకుండా ఉంటానని కె. అన్నామలై గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే..నిన్న విలేఖరుల సమావేశంలో అన్నామలై తన షూ తొలగించి, “రేపటి నుంచి డిఎంకెను గద్దె దించేవరకు తాను ఎలాంటి పాదరక్షలు ధరించను, అన్నా యూ...