Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్రగతిని పెంపొందించడానికి పార్టీ అమలు చేయనున్న ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి బిజెపి చిత్తశుద్ధితో పనిచేస్తోందని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు.
“స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీలకమైన అంశంగా తమ పార్టీ భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని భారతదేశంతో ఉంచడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము” అని అమిత్ షా అన్నారు. దేశంలో జమ్మూ కాశ్మీర్ ను అంతర్భాగంగా ఉండేలా బిజెపి మొదటి నుంచి పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. . ప్రాంత సమైక్యత కోసం పార్టీ చేస్తున్న పోరాటాన్ని జనసంఘ్, బిజెపి రెండూ ముందుకు తీసుకెళ్లాయని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో ఒక భాగమని, అలాగే కొనసాగుతుందని షా నొక్కిచెప్పారు, భారతదేశంలోనే ఈ ప్రాంతం భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలనే బిజెపి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ఆర్టికల్ 370 ఎప్పటికీ యూ-టర్న్ తీసుకోదు
ఆర్టికల్ 370 చరిత్రగా మిగిలిపోయిందని, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎప్పటికీ తిరిగి బిజెపి పేర్కొంది. విలేఖరుల సమావేశంలో, అమిత్ షా మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల బిజెపి పదవీ కాలం J&K చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగించడానికి ప్రజలు తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.
మహిళలకు వరాల జల్లు..
Jammu Kashmir Assembly Elections “ప్రతి కుటుంబంలోని పెద్ద మహిళకు ప్రతీ సంవత్సరం రూ.18,000 ఇవ్వడానికి ‘మా సమ్మాన్ యోజన’ తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అమిత్ షా వెల్లడించారు. ఉజ్వల పథకం కింద సిలిండర్లు, సంవత్సరానికి ప్రగతి శిక్షా యోజన కింద, ప్రయాణ భత్యంగా కళాశాల విద్యార్థులకు సంవత్సరానికి రూ. 3,000 అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..