Sunday, April 27Thank you for visiting

మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం

Spread the love
  • విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB

  • ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానం

న్యూఢిల్లీ,  హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది.

2019 నుంచి 2021 మధ్యకాలంలో 18 ఏళ్లు పైబడిన 10,61,648 మంది మహిళలు, 18 ఏళ్లలోపు బాలికలు 2,51,430 మంది కనిపించకుండా పోయారు. National Crime Records Bureau నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ వివరాలను సేకరించింది. మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు, పశ్చిమ బెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు, మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు అదృశ్యమయ్యారు.

READ MORE  Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

తెలంగాణ రాష్ట్రంలో..

తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం తప్పిపోయిన బాలికలు, మహిళల ఆచూకీ లభించిందని తెలంగాణ రాష్ట్ర పోలీసులు తెలిపారు. కాగా రాష్ట్రంలోని బాలికలు మహిళలు తప్పిపోయిన కేసులకు లైంగిక దోపిడీ, బాల కార్మికులు, బంధించిన కార్మికులు, భిక్షాటన, బాల్య వివాహాలు వంటి తీవ్రమైన నేర కార్యకలాపాలతో సంబంధం లేదని తేలింది. తెలంగాణ రాష్ట్రంలో రికవరీ గణాంకాలు.. జాతీయ సగటు 62 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.

“పోలీస్ డిపార్ట్‌మెంట్ తప్పిపోయిన వ్యక్తులపై అన్ని కేసులను నమోదు చేసి, తక్షణమే దర్యాప్తు చేపట్టింది. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది” అని తెలంగాణ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

READ MORE  Sandeshkhali row : 'మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్షాస్మృతిని అనుమతించేందుకు క్రిమినల్ లా (సవరణ) చట్టంతో సహా దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల చిన్నారుల అత్యాచారం కేసుల్లో విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని, మరో రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

READ MORE  కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..