మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..

మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసు ఉపసంహరించుకోకపోవడంతో బాధిత కుటుంబంలో ఓ యువకుడిని నిందితులు హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిని వివస్త్ర ను చేశారు.
తనపై లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోకపోవడంతో ఓ నిందితులు బాధితులపై కక్ష పెంచుకున్నాడు. కేసు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. ఈక్రమంలో నిందితుడు బాధితురాలి సోదరుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన అతడి తల్లిని వివస్త్రను చేసి దాడిచేశాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
2019లో బాధితురాలి సోదరి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ బాధితులతో వాగ్వాదం చేశాడు. కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు బాధితుడు.. 18 ఏళ్ల నితిన్ అహిర్వార్‌ను కొట్టి చంపాడు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలి సోదరిపై నిందితుడు ఒత్తిడి తెచ్చాడు.
నిందితుడు మొదట బాధితురాలి ఇంటిని ధ్వంసం చేసి, ఆపై సోదరుడిని హత్య చేశాడు. బాధితురాలి తల్లి అడ్డుకునేందుకు యత్నించగా ఆమెను వివస్త్రను చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. అరెస్టయిన తొమ్మిది మంది నిందితులో పాటు, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదైంది.
అదనపు ఎస్పీ సంజీవ్ ఉయికే ప్రకారం, “సెక్షన్ 307 కింద ప్రధాన నిందితుడితో సహా తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేశాము. . ఆసుపత్రిలో బాధితుడు మరణించిన తర్వాత, సెక్షన్ 302 మరియు SC/ST చట్టం కూడా నమోదు చేశాం’’ అని తెలిపారు. నిందితుల్లో ఒకరైన కోమల్ సింగ్ ఇంకా పరారీలో ఉన్నాడు.
బాధితురాలి సోదరి ప్రకారం, కోమల్ సింగ్, విక్రమ్ సింగ్, ఆజాద్ సింగ్ సహా నిందితులు ఆమె ఇంటికి వచ్చి లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బలవంతపెట్టారు. అయితే బాధితురాలి తల్లి నిరాకరించడంతో ఆమెను బెదిరించి ఇంటిని ధ్వంసం చేశారు.
“వారు ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని బస్టాండ్ వద్ద నితిన్‌ను కలుసుకుని కొట్టడం ప్రారంభించారు. మా తల్లి అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లగా, వారు ఆమెను కూడా కొట్టి, వివస్త్రను చేశారు. వారిని విడిచిపెట్టమని నేను వారిని వేడుకున్నాను. దీంతో నాపై అత్యాచారం చేస్తామని బెదిరించారు. నేను అడవిలోకి పరిగెత్తాను. సహాయం కోసం పోలీసులను పిలిచాను” అని బాధితురాలి సోదరి వెల్లడించింది. కాగా ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందళనలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE  Jabalpur | తండ్రి, సోదరుడిని చంపిన 15 ఏళ్ల బాలిక.. శరీరాలను ముక్కలు చేసి ఫ్రీజర్‌లో..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *