Home » కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్

Spread the love

[wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్

డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో  పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు.

READ MORE  దసరా సెలవుకు ఊరెళుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

ఓ వ్యక్తి గుర్రం నోరు మూసివేసి ముక్కు ద్వారా బలవంతంగా సిగరేట్ తాగించాడు. సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అయ్యారు. జీవనోపాధి కోసం ఉపయోగించే జంతువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. గుర్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతువుల ఇంద్రియాలను మొద్దుబారేటట్లు చేసి అది మరింత కష్టపడి పనిచేయడానికే ఇలా చేశారని ఆరోపించారు.

హిమాలయాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో యాత్రికులతోపాటు వారి సామగ్రిని తీసుకెళ్లడానికి గుర్రాలు, గాడిదలను ఉపయోగిస్తారు.

READ MORE  జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

రుద్రప్రయాగ్‌లోని పోలీసులు ఈ వీడియోను పరిశీలించారు. కేదార్‌నాథ్‌కు 16 కిలోమీటర్ల ట్రెక్ మార్గంలో చోటి లించోలి సమీపంలోని థారు క్యాంప్‌లో ఈ సంఘటన జరిగిందని గుర్తించినట్లు సోన్‌ప్రయాగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ చంద్ర బలుని తెలిపారు.

దీనికి సంబంధించి గుర్రం యజమాని రాకేష్ సింగ్ రావత్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

READ MORE  Kallakurichi | క‌ల్తీ మ‌ద్యం కేసు.. 49కి చేరిన మృతుల సంఖ్య.. న్యాయ విచారణకు స్టాలిన్ ఆదేశం..

సిగరెట్‌లో గంజాయి వంటివి కలిపారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు బాలుని తెలిపారు. కాగా బాధ్యులైన గుర్రాలు, గాడిదల యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం కాగా, రెండు నెలల్లో అశ్వాలపై దుశ్చర్యలకు సంబంధించి పోలీసులు 14 కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..