Home » ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
Odisha Bus Accident

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

Spread the love

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రైవేట్​ వాహనం..
అక్కడికక్కడే 12 మంది మృతి..

Odisha Accident Today : ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.. ఇందులో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గంజామ్ జిల్లా దిగప హండి సమీపంలో.. ఒడిశా ఆర్టీసీ బస్సు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతతో రెండు బస్సులూ పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి.
ప్రమాదం గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అంబులెన్సులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ( MKCG ) ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నపుడే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

READ MORE  Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

Odisha Bus Accident : అయితే ప్రైవేటు బస్సులోని వారే.. ఎక్కువ మంది మరణించినట్లు తెలుస్తోంది. “ఓఎస్‌ఆర్‌టీసీ (OSRTC) బస్సు రాయ్​గఢ్ నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తోంది. బ్రహ్మపుర ప్రాంతంలోని ఖండదేయులి గ్రామం నుంచి ప్రైవేట్ బస్సులో ఒక వివాహ బృందం వెళ్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని, ఒక బస్సు డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. మరో బస్సు డ్రైవర్​ ఆచూకీ తెలియరాలేదు” అని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి సంతాపం..
గంజాం జిల్లాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల కు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి నవీన్​ సర్కార్​ రూ.30,000 పరిహారం ప్రకటించింది.

READ MORE  Defense Deal  | భార‌త్ కు త్వ‌ర‌లో ప్రిడేటర్ డ్రోన్‌లు.. వీటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..