
కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్
[wpstatistics stat=usersonline]కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్ పొగ తాగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇ టీవల వైరల్ అయిన విష యం తెలిసిందే. దీనిపై నె టిజన్లు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసు అధికారులు కఠిన చర్యలకు దిగారు.ఓ వ్యక్తి గుర్రం నోరు మూసివేసి ముక్కు ద్వారా బలవంతంగా సిగరేట్ తాగించాడు. సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫైర్ అయ్యారు. జీవనోపాధి కోసం ఉపయోగించే జంతువు పట్ల అమానవీయంగా ప్రవర్తించారంటూ దుమ్మెత్తిపోశారు. గుర్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతువుల ఇంద్రియాలను మొద్దుబారేటట్లు చేసి అది మరింత కష్టపడి పనిచేయడానికే ఇలా చేశారని ఆరోపించారు.హిమాలయాల్లోన...