Indian Railways 100-day Roadmap : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే కనెక్టివిటీ కోసం భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అనేక విప్లవాత్మక మార్పులు చేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా కొత్తగా 24 గంటల్లోనే టికెట్ వాపసు పథకం, వందే భారత్ స్లీపర్ రైలు, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి విస్తరణ ప్రారంభం, రైల్వే ప్రయాణీకుల కోసం “సూపర్ యాప్”, భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే వంతెన వంటి సంస్కరణలు చేపట్టనుంది. ఇవి కూడా 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది.
కొత్త ప్రభుత్వం కోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలను అనుసరించి మంత్రిత్వ శాఖలు వివిధ “ప్రజలకు ఆకర్షణీయమైన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ రైల్వేలు 24 గంటల టికెట్ వాపస్ పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, టికెటింగ్, రైలు ట్రాకింగ్ వంటి పలు సేవలను అందించే సమగ్రమైన “సూపర్ యాప్”ను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది.భారతీయ రైల్వే 100-రోజుల రోడ్‌మ్యాప్ ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం..
వందరోజుల రోడ్ మ్యాప్
- Indian Railways 100-day Roadmap : భారతీయ రైల్వేలు మొదటి 100 రోజుల్లోనే ప్రయాణీకుల కోసం PM రైల్ యాత్రి బీమా యోజన పథకాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- 11 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమయ్యే 40,900 కిలోమీటర్ల మేర మూడు ఆర్థిక కారిడార్లకు ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం కోరుతోంది.
- 24 గంటల్లోగా రైలు టికెట్ రద్దు కోసం ప్రయాణీకులు వాపసు పొందేందుకు మరింత ప్యాసింజర్ ఫ్రెండ్లీ రీఫండ్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
- రైలు ప్రయాణీకులు తమ రైలు రన్నింగ్ స్టాటస్ ట్రాక్ చేయడానికి, టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, ఇతర రైల్వే సంబంధిత పనులను ఒకే చోట చేయడానికి అనుమతించే “సూపర్-యాప్ (Super – App)” ప్రారంభించబడవచ్చు.
- ఉధంపూర్- రైలు మార్గం పూర్తి చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వరకు రైళ్లను నడిపించే ప్రణాళికలను రూపొందిస్తోంది. శ్రీనగర్-బారాముల రైలు లింక్ ప్రాజెక్ట్. USBRL ప్రాజెక్ట్ లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది!) చీనాబ్ వంతెన, భారతీయ రైల్వేలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ వంతెన అయిన అంజి ఖాడ్ వంతెన ను నిర్మించనున్నారు.
- భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ -లిఫ్ట్ వంతెన, ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలిపే పాంబన్ రైల్వే వంతెన ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న 1913 రైలు వంతెనకు సంబంధించి భద్రతా కారణాల దృష్ట్యా మండపం, రామేశ్వరం వరకు రైలు సేవలను 2022 డిసెంబర్‌లో నిలిపివేశారు.
- వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌లను ప్రవేశపెట్టడంపై కూడా రైల్వే అధికారులు దృష్టి సారించారు. వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనా ప్రస్తుతం బెంగుళూరులో BEMLచే తయారవుతోది. ఆరు నెలల్లో సిద్ధంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
- బుల్లెట్ రైలు ప్రాజెక్టును వేగవంతం చేయడాన్ని ఇండియన్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 2029 నాటికి అహ్మదాబాద్-ముంబై మధ్య 508 కి.మీల బుల్లెట్ రైలు మార్గంలో దాదాపు 320 కి.మీ పరిధిలో బులె్ రైలు అందుబాటులోకి రానుంది.
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..