
Italy | వలస సంక్షోభంపై యూరప్ దేశాలు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వైరల్ వీడియోలో, మెలోని ఇటలీ “యూరప్ శరణార్థి శిబిరం ప్రమాదంగా మారుతోందని, లిబియాలో నావికా దిగ్బంధనం చేయడంతోపటు NGO రెస్క్యూ షిప్‌లను సముద్రంలో ముంచేయాలని పిలుపునిచ్చింది. “మేము యూరప్ శరణార్థుల శిబిరంగా మారే ప్రమాదం ఉంది, మాకు లిబియాలో నావికా దిగ్బంధనం అవసరం, NGO నౌకలను ముంచడం ప్రారంభించాలి” అని ఇటాలియన్ PM ఆవేశపూరితంగా అన్నారు.
అక్రమ వలసలకు వ్యతిరేకంగా మెలోని కఠిన వైఖరిని హైలైట్ చేస్తూ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ప్రభుత్వం ఇటీవల 23వ సారి రెస్క్యూ షిప్ జియో బారెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. మధ్యధరా వలసలపై అణిచివేతను తీవ్రతరం చేసింది. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (MSF) ఆధ్యంలో నిర్వహిస్తున్న ఓడ 191 మంది వలసదారులను రక్షించిన తర్వాత సాలెర్నోలో నిర్బంధించబడింది. ఇటాలియన్ అధికారులు జియో బారెంట్స్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని, సకాలంలో సమాచారాన్ని అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు, అయితే MSF దాని చర్యలను సమర్థించింది. వలసదారులను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Giorgia Meloni reacts strongly on illegal islamic migrant crisis infesting europe & italy:
“We risk becoming Europe’s refugee camp, we risk becoming the laughing stock of the world! We need a naval blockade in Libya and to start sinking NGO ships” pic.twitter.com/8ap1pV0Etk
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 30, 2024
మెలోని ప్రభుత్వ తీరు, కఠినమైన విధానాలు మానవతావాద సంస్థల నుండి విమర్శలు వచ్చాయి. Italyi ప్రభుత్వ చర్యలు కీలకమైన రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయని, ప్రాణనష్టం పెరగుతుందని వాదించారు.వలసదారుల రాక తగ్గినప్పటికీ, గత సంవత్సరం 112,500 మందితో పోలిస్తే ఈ సంవత్సరం 39,500 మంది సముద్ర మార్గంలో ఇటలీకి చేరుకున్నారు, నౌకాయానంలో తగ్గుదల కనిపంచలేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) ఈ సంవత్సరం సెంట్రల్ మెడిటరేనియన్‌లో కనీసం 1,027 మంది వలసదారులు మరణించినట్లు నివేదించింది.
పోప్ ఫ్రాన్సిస్ తన ప్రసంగంలో వలసదారులకు సహాయ నిరాకరణను “తీవ్ర పాపం”గా అభివర్ణించారు. EU, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇటలీ చర్యలకు వ్యతిరేకంగా మానవతావాద సంఘాలు, UN యూరోపియన్ కమిషన్‌ను ఒత్తిడి చేస్తున్నాయి.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.