Kochi : కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఈపీఎఫ్ పొదుపు చేసుకున్నాడు. చివరకు ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులను డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు. అయితే క్లెయిమ్ కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు డాక్యుమెంటేషన్ లోపాలను ఎత్తిచూపుతూ అతని క్లెయిమ్ లను తిరస్కరించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈపీఎఫ్ అధికారులు ఎటువంటి అదనపు పత్రం సమర్పించకుండానే ప్రావిడెంట్ ఫండ్ చెల్లించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. అధికారులు కనీసం మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా అడగలేదు. మృతుడు 69 ఏళ్ల కెపి శివరామన్ (K P Sivaraman) కుమారుడు ప్రదీష్ తెలిపారు. ఈపీఎఫ్ అధికారుల తీరుతో విసిగిపోయిన కెపి శివరామన్ గత నెలలో కొచ్చిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) కార్యాలయంలో విషం ఆత్మహత్యకు పాల్పడ్డాడు .
శివరామన్ మరణం తర్వాత అతడి కుటుంబానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను EPFO క్లియర్ చేసింది. అయితే, శివరామన్ భార్య చట్టబద్ధమైన నామినీ అని పేర్కొంటూ, అతని మరణం తర్వాత EPFO కార్యాలయానికి సమర్పించిన లేఖ మినహా, ఎటువంటి అదనపు పత్రాలు సమర్పించకుండా పేమెంట్స్ ను క్లియర్ చేసింది. అయితే ఈపీఎఫ్ అధికారుల తీరుపై ఆయన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. “నాన్న పోయారు. అయితే ఎవరి తండ్రులకు కూడా ఇలా అన్యాయం జరగకూడదని పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. అతని పొదుపు డబ్బులను తిరిగి ఇవ్వడానికి అతను చనిపోయే వరకు వేచి ఉన్నారు. ”అని రోజువారీ కూలీ అయిన 39 ఏళ్ల ప్రదీష్ చెప్పారు.
EPFO rules : ఈపీఎఫ్ విత్ డ్రా కోసం ఏం కావాలి..
ఈపీఎఫ్ నిబంధనల (EPFO rules) ప్రకారం, మరణించిన సభ్యుల PF విత్ డ్రా క్లెయిమ్ చేయడానికి ఫారం 20ని సమర్పించాలి. కుటుంబ సభ్యులు మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్‌లలో డెత్ సర్టిఫికేట్, గార్డియన్‌షిప్ సర్టిఫికేట్, అప్లికేషన్ మైనర్ సభ్యుని సహజ సంరక్షకుడు కాకుండా వేరే సంరక్షకుడి ద్వారా అయితే, అలాగే బ్లాంక్/ క్యాన్సెల్డ్ చెక్కు కాపీని సమర్పించాలి. అన్నీ సరిగా ఉంటే విత్ డ్రా డబ్బులు హక్కుదారు ఖాతాకు డబ్బులు చెల్లిస్తుంది.
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన శివరామన్, అపోలో టైర్స్‌లో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ తర్వాత గత తొమ్మిదేళ్లుగా EPFO కార్యాలయాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తూనే ఉన్నారు. శివరామన్ గుర్తింపు పత్రాల్లో సరిపోలడం లేదని పేర్కొంటూ రూ. 90,000కు పైగా బకాయిలను ఈపీఎఫ్‌వో పెండింగ్‌లో ఉంచింది. EPFO అధికారులు అతని స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌ను డిమాండ్ చేశారు, అతను అందించలేకపోయాడు. దీంతో ఇది PF మొత్తాన్నిఅందించేదుకు అధికారులు తిరస్కరించారు. దీంతో విసిగి వేసారిన శివరామన్ ఫిబ్రవరి 7న కొచ్చిలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. EPF ఫైనల్ సెటిల్‌మెంట్ తిరస్కరణ రేట్లు 2017-18లో దాదాపు 13 శాతం నుండి 2022-23లో దాదాపు 34 శాతానికి పెరిగిందని ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన పరిశోధనలో పేర్కొంది. ఇది ప్రతి మూడు క్లెయిమ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..