Transco & Discoms | ఇంట్లో నుంచే విద్యుత్ సేవలు.. అందుబాటులోకి ఆన్ లైన్ పోర్టల్
పోర్టల్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
TSNPDCL | హైదరాబాద్: హెచ్ టీ లైన్ల తరలింపు సేవలతో సహా డిస్కం, ట్రాన్స్ కో ( Transco & Discoms) ల మధ్య వివిధ రకాల కార్యకలాపాలు ఇక నుంచి ఆన్ లైన్ లోనే అందుబాటు లోకి రానున్నాయి. ఈ సేవ లకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ ను డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
Transco & Discoms : 132, 220, 400 కేవీ కొత్త సర్వీసులు, 11 కేవీ/ 33 కేవీ కొత్త సర్వీసులతో పాటు హెచ్ టీ/ హెచ్ టీ సర్వీ సుల కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు (DISCOM office) చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. ఇంటి నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి వేగవంతంగా సేవలు అందించే విధంగా కొత్తగా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. ఈ సేవల కోసం ఆన్ లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడు పని ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే వెసులు బాటు ఉంది.
ప్రయోజనాలు ఏంటీ?
- వినియోగదారులు తమ దరఖాస్తును కార్యాలయాల్లో కాకుండా నేరుగా ఆన్ లైన్ లోనే సమర్పించవచ్చు.
- సింగిల్ విండో విధానం ద్వారా అధికారులు దరఖాస్తును వేగవంతంగా పరిశీలించి ప్రక్రియను పూర్తి చేస్తారు.
- వినియో గదారులు డిస్కం ఆఫీసుకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే సంబంధిత సేవా రుసుమును చెల్లించవచ్చు.
- డిస్కం వారు వినియోగదారునితో నిరంతరం అందుబాటులో ఉండి దరఖాస్తు చేసుకున్న సేవకు సంబంధించిన స్టేటస్ వివరాలను కమ్యూనికేట్ చేస్తారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..